భోజనం చివర్లో ఒక ముద్ద పెరుగుతో తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా అన్నం తిన్నాక చివర్లో ఒక ముద్ద పెరుగు తినడం ప్రతి ఒక్కరికీ అలవాటు ఉంటుంది. మన పెద్దవారు కూడా

Update: 2024-06-14 08:51 GMT

దిశ, ఫీచర్స్ : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా అన్నం తిన్నాక చివర్లో ఒక ముద్ద పెరుగుతో తినడం ప్రతి ఒక్కరికీ అలవాటు ఉంటుంది. మన పెద్దవారు కూడా చివరకు ఒక ముద్ద అన్నం పెట్టుకొని, పెరుగు వేసుకో అమ్మా .. అని చెబుతుంటారు. అయితే భోజనం చివర్లో పెరుగుతో అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా అనే విషయం చాలా మందికి తెలియదు. కాగా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం చివర్లో పెరుగు తినడంపై నిపుణుల అభిప్రాయం ఏంటో? దాని వలన ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే భోజనం లాస్ట్‌లో పెరుగుతో అన్నం తినడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. తప్పకుండా రోజులో కనీసం ఒక్క ముద్ద అయినా ఇలా తినాలి అంట. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అవి ఏమిటంటే?

  • పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి భోజనం చివరిలో ఒక ముద్ద పెరుగన్నం తినడం వలన మనం తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుందంట.

  • రోగనిరోధక శక్తిని పెంచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన తప్పకుండా భోజనంలో కాస్త పెరుగును చేర్చుకోవాలంట.

  • పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనం రోజులో కనీసం ఒక్కసారైనా పెరుగు తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయంట.

  • పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందంట. ఇదే కాకుండా అధికరక్తపోటుతో బాధపడే వారికి, చర్మ సంరక్షణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.

Similar News