వారానికి రెండుసార్లు శనగలు తినడం వల్ల కలిగే లాభాలు
మనలో చాలా మంది ఇష్టపడే వంటకాల్లో శనగలు కూడా ఒకటి. కాగా ఈ శక్తివంతమైన చనా తినడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. వారానికి
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది ఇష్టపడే వంటకాల్లో శనగలు కూడా ఒకటి. కాగా ఈ శక్తివంతమైన చనా తినడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి వివరిస్తున్నారు.
- ప్రోటీన్ల సమృద్ధి : శనగలు మొక్క ఆధారిత ప్రోటీన్ల అద్భుత మూలంగా ఉన్నాయి. శాకాహారులు, మాంసం మానేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్.
- జీర్ణక్రియ : చిక్ పీస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. విషయాలు సజావుగా సాగేలా చేస్తుంది.
- ఆరోగ్యకరమైన బరువు : ప్రోటీన్, ఫైబర్ కలయిక ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గించి.. బరువు నియంత్రణకు హెల్ప్ చేస్తుంది.
- గుండె ఆరోగ్యం : చిక్ పీస్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
- ఎముకల ఆరోగ్యం : శనగలు.. కాల్షియం, మెగ్నీషియంకు మంచి మూలంగా ఉన్నాయి. ఇవి బలమైన ఎముకలను నిర్వహించేందుకు, ఎముక సంబంధిత సమస్యలను నివారించేందుకు దోహదం చేస్తాయి.
- శక్తి మెరుగు : శనగల్లోని ఐరన్ కంటెంట్ శరీరం అంతటా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తుంది.