బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆకుల రసాన్నీ ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలు ఎంత పొడవు జుట్టు ఉండాలి అనుకుంటారో, అబ్బాయిలు అంత ఒత్తుగా జుట్టు ఉండాలని ఆశపడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలు ఎంత పొడవు జుట్టు ఉండాలి అనుకుంటారో, అబ్బాయిలు అంత ఒత్తుగా జుట్టు ఉండాలని ఆశపడుతుంటారు. కానీ ఈమధ్య కాలంలో చాలా మందికి బట్టతల వస్తుంది. 25 ఏళ్లు దాటని వారు కూడా జుట్టు పలచపడటం, బట్టతల రావడం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. దీంతో బట్టతలను కవర్ చేయడానికి రకరకాల టోపీలు ఉపయోగిస్తూ ఇబ్బంది పడుతున్నారు. అయితే అలాంటి వారికోసమే చక్కటి చిట్కా. బట్టతల తగ్గడానికి హాస్పటల్స్ చుట్టూ తిరగకుండా చిన్న చిట్కాలతో బట్టతలను ఎలా మాయం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గురివింద ఆకు చెట్టు అందరికీ తెలిసిందే. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అందువలన వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బట్టతల ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే ఈ ఆకు రసం చర్మ సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంలా పని చేస్తుందంట. అయితే బట్టతలతో బాధపడే వారు గురివిం చెట్టు ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే వెంట్రుకలు క్రమంగా, ఒత్తుగా పెరుగుతాయంట. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది అంటున్నారు.