అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చాలా మంది ప్రజలను ప్రభావితం చేసే సాధారణ రుగ్మతల్లో రక్తపోటు లేదా అధిక రక్తపోటు ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారం, సిగరేట్ ,ధూమపానం, అధిక బరువు, అధిక ఉప్పు వంటి వాటి వలన వస్తుంటుంది.

Update: 2024-06-12 05:15 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చాలా మంది ప్రజలను ప్రభావితం చేసే సాధారణ రుగ్మతల్లో రక్తపోటు లేదా అధిక రక్తపోటు ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారం, సిగరేట్ ,ధూమపానం, అధిక బరువు, అధిక ఉప్పు వంటి వాటి వలన వస్తుంటుంది. అంతే కాకుండా మధుమేహం వంటి వ్యాధులు ఉన్న వారు కూడా ఈ డిసీజ్ బారిన పడే ఛాన్స్ ఉంది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాకాశం కూడా ఉంది. అయితే ఇది ఎక్కువగా కాస్త వయసు అయిపోయే వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుతం చిన్న వయసు, చివరకు పిల్లలలో కూడా కనిపిస్తుంది. అందువలన ఈ లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తలనొప్పి : అధిక రక్తపోటు వలన తలనొప్పి విపరీతంగా వస్తుంటుంది. ఒక్కోసారి ఈ తలనొప్పిని భరించడం కూడా చాలా కష్టం అంట.


2. శ్వాసలోపం : అధిక రక్తపోటు భారిన పడి వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారంట. అస్పష్టమైన శ్వాస రావడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.


3.తల తిరగడం : తల తిరగడం కూడా అధిక రక్తపోటు లక్షణమే. తల తిరిగినట్లు అనిపించడం,

4. దృష్టిలో మార్పులు : అధిక రక్తపోటు బారిన పడిన వారిలో దృష్టిలోపం జరుగుతుంది. సరిగా కనిపించకపోవడం, కళ్లు మసకబారినట్లు అనిపించడం జరుగుతుంది.

5. ఛాతి నొప్పి : అధిక రక్తపోటులో సర్వసాధారణమైన లక్షణం ఛాతిలో నొప్పి. శ్వాస సరిగ్గా అందకపోవడం. గుండె కొట్టుకోవడంలో తేడా, వీటితో పాటు కొన్ని సార్లు ఛాతి నొప్పి కూడా వస్తుంది.

6.అలసట : రక్తపోటు లక్షణాలలో తీవ్రమైన అలసట అనేది ఒకటి. అధిక రక్తపోటు కారణంగా గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడం కష్టమవడం వల్ల మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషక సరఫరాలను తగ్గిస్తుంది.

7.కాళ్ళు మరియు పాదాలలో వాపు : అధిక రక్తపోటు లక్షణాల్లో కాళ్లు, పాదలలో వాపు కనిపిస్తుంది. కాసేపు కూర్చున్నా సరే కాళ్లు వాచినట్లుగా అనిపించడం జరుగుతుంది.

8.అసాధారణ గుండె శబ్దాలు : అధిక రక్తపోటు వాళ్ళ ఒక్కోసారి గుండె పై ఒత్తిడి తెస్తుంది. దీనికి కారణం అధిక రక్తపోటు వల్ల గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోవడమే. కాబట్టి శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బ్బందులు ఏర్పడతాయి.

9 . రెటీనా పై ప్రభావం : అధిక రక్తపోటు కారణంగా ముఖ్యంగా కళ్ళలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. వీటి వల్ల అస్పష్టమైన దృష్టి, డబుల్ విజన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి దీని తీవ్రత వాళ్ళ ఒక్కోసారి కంటిలోని రెటీనాను దెబ్బతీస్తుంది.


Similar News