సమాజాన్ని మనిషి శాసించలేడు…
దిశ వెబ్ డెస్క్: సాంకేతికత ఎంత పెరిగినా సమాజాన్ని మనిషి శాసించలేడనీ, ఈ విషయాన్ని కరోనా తేల్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో పోరాడేందుకు ప్రపంచంలో పలు దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. అయినా ఆర్ఎన్ఏ వైరస్ లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లు లేవని ఆయన అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయోగాలకు ప్రభుత్వాలే ఫండింగ్ చేస్తున్నాయని ఆయన అన్నారు. కరోనాకు ఆక్స్ పర్డ్ వ్యాక్సిన్ పై అందరూ ఆశలు పెట్టుకున్నారని […]
దిశ వెబ్ డెస్క్:
సాంకేతికత ఎంత పెరిగినా సమాజాన్ని మనిషి శాసించలేడనీ, ఈ విషయాన్ని కరోనా తేల్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో పోరాడేందుకు ప్రపంచంలో పలు దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. అయినా ఆర్ఎన్ఏ వైరస్ లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లు లేవని ఆయన అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయోగాలకు ప్రభుత్వాలే ఫండింగ్ చేస్తున్నాయని ఆయన అన్నారు.
కరోనాకు ఆక్స్ పర్డ్ వ్యాక్సిన్ పై అందరూ ఆశలు పెట్టుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ పై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. ఆర్ఎన్ఏ వైరస్ లో ఒకటైన హెచ్ఐవీకి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సమాజాన్ని ప్రకృతి మాత్రమే శాసించగలదన్నారు.