హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఒత్తిడే కారణామా!
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది పోలీస్ అధికారి స్థాయి నుంచి చిన్న స్థాయి ఉద్యోగులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉన్నతాధికారులు చేస్తున్న ఒత్తిడి భరించలేక ప్రాణాలు వదిలితే మరికొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని లాడో సరాయ్ ఏరియాలో […]
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది పోలీస్ అధికారి స్థాయి నుంచి చిన్న స్థాయి ఉద్యోగులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉన్నతాధికారులు చేస్తున్న ఒత్తిడి భరించలేక ప్రాణాలు వదిలితే మరికొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని లాడో సరాయ్ ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సంజయ్ ఢిల్లీలోని సాకేత్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎం జరిగిందో తెలీదు కానీ.. ఉన్నట్టుండి సంజయ్ తన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదు. అయితే, సంజయ్ అన్నకు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగుండటంలేదని, ఎప్పుడూ సోదరుడి ఆనారోగ్యం గురించి చెబుతూ బాధపడేవాడని, ఆ ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో భాగంగా అనుమానిస్తున్నారు.