ఆడపిల్ల పుట్టిందని.. ఇంట్లోంచి గెంటేశారు!
దిశ, హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన గురువారం కలకలం రేపింది. బాధితురాలి వివరాల ప్రకారం… రెండేండ్ల కింద హసన్‌పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన నూనావత్ నిర్మలతో స్టేషన్ ఘనపూర్ చినపెండ్యాలకు చెందిన బాలరాజుకు వివాహం జరిగింది. ఈ దంపతులు హన్మకొండ అశోక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. […]
దిశ, హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన గురువారం కలకలం రేపింది. బాధితురాలి వివరాల ప్రకారం… రెండేండ్ల కింద హసన్‌పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన నూనావత్ నిర్మలతో స్టేషన్ ఘనపూర్ చినపెండ్యాలకు చెందిన బాలరాజుకు వివాహం జరిగింది. ఈ దంపతులు హన్మకొండ అశోక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల నిర్మల ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో బాలరాజు భార్యను ఇబ్బందులకు గురి చేయ సాగాడు. కాగా గురువారం ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ మేరకు బాధితురాలు భర్త బాలరాజు నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ బాలరాజు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నిర్మలకు మహిళ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సుబేదారి పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.