రైతుల ఆందోళనలో మద్యం మస్తుగా పంచిన : కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: హర్యానా కాంగ్రెస్ నేత విద్యా దేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలో మద్యం, డబ్బుల్ని పంపిణీ చేసినట్లు  చెప్పారు. హర్యానాలోని జింద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కి  ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుభాష్ గంగోలితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాదేవీ మాట్లాడుతూ రైతుల చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వారికి తన వంతు సాయంగా డబ్బులు, కూరగాయలు, […]

Update: 2021-02-15 08:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: హర్యానా కాంగ్రెస్ నేత విద్యా దేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలో మద్యం, డబ్బుల్ని పంపిణీ చేసినట్లు చెప్పారు.

హర్యానాలోని జింద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుభాష్ గంగోలితో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాదేవీ మాట్లాడుతూ రైతుల చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వారికి తన వంతు సాయంగా డబ్బులు, కూరగాయలు, మద్యాన్ని పంపిణీ చేసినట్లు గర్వంగా చెప్పారు. అంతేకాదు ఓ వైపు మీడియా సైతం ఆమె ప్రసంగాన్ని రికార్డ్ చేస్తుండగా ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రైతుల ఆందోళనలో మద్యాన్ని ఎందుకు పంపిణీ చేశారో స్పష్టం చేశారు.

ఆందోళనలో అన్నీ వర్గాలకు చెందిన రైతులు పాల్గొంటారు. వారిని ఉత్సాహపరచాలి. వారితో ఆందోళన ఉధృతం చేయించాలి. అందుకే అనారోగ్య సమస్యలు తలెత్తిన ఆందోళనకారుల్లో ఉత్సాహం కలిగించేందుకు మద్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహాత్మా గాంధీయే ఆదర్శం

కాంగ్రెస్ నేత విద్యా దేవి వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు.రైతు ఆందోళనకారులకు మద్యం పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ మహిళా నేత శ్రీమతి విద్యా రాణి మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా భావించే కాంగ్రెస్‌ పార్టీ పతనానికి ఇదో పరాకాష్ట’ అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News