బ్లాక్ ఫంగస్‌తో బీజేపీ సీనియర్ నేత కన్నుమూత..

దిశ, వెబ్‌డెస్క్ : బ్లాక్ ఫంగస్ సోకి హర్యానా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు కమలా వర్మ(93) మృతిచెందారు. వివరాల ప్రకారం.. కమలా వర్మ ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న అనంతరం.. ఆమె బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాత్రి తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. కమలా వర్మ మృతి […]

Update: 2021-06-08 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్లాక్ ఫంగస్ సోకి హర్యానా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు కమలా వర్మ(93) మృతిచెందారు. వివరాల ప్రకారం.. కమలా వర్మ ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న అనంతరం.. ఆమె బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాత్రి తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.

కమలా వర్మ మృతి పట్ల హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కమలా వర్మ.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ సహా పలువురు సీనియర్‌ పార్టీ నాయకులతో కలిసి పని చేశారు.

 

Tags:    

Similar News