స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయ్ : జాన్వీ కపూర్ బ్రదర్

దిశ, సినిమా : అనిల్ కపూర్ కొడుకు, నటుడు హర్షవర్ధన్ కపూర్.. బాలీవుడ్‌లో తన కజిన్ సిస్టర్ జాన్వీ కపూర్ కెరీర్ ఎలా ఉండబోతుందో చెప్పాడు. స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కావల్సిన ఫీచర్స్ అన్నీ తనలో ఉన్నాయన్నాడు. ఇక తన యాక్టింగ్ కెరీర్ విషయానికొస్తే.. హాలీవుడ్‌లో ప్రయత్నించమని సోదరి సోనమ్ కపూర్ చెప్పినట్టు వెల్లడించాడు. ఆర్జే సిద్దార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్ష.. ఈ విషయాలను రివీల్ చేశాడు. ప్రత్యేకించి జాన్వీ గురించి చెబుతూ.. తను బ్యూటిఫుల్, […]

Update: 2021-07-08 01:57 GMT

దిశ, సినిమా : అనిల్ కపూర్ కొడుకు, నటుడు హర్షవర్ధన్ కపూర్.. బాలీవుడ్‌లో తన కజిన్ సిస్టర్ జాన్వీ కపూర్ కెరీర్ ఎలా ఉండబోతుందో చెప్పాడు. స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కావల్సిన ఫీచర్స్ అన్నీ తనలో ఉన్నాయన్నాడు. ఇక తన యాక్టింగ్ కెరీర్ విషయానికొస్తే.. హాలీవుడ్‌లో ప్రయత్నించమని సోదరి సోనమ్ కపూర్ చెప్పినట్టు వెల్లడించాడు. ఆర్జే సిద్దార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్ష.. ఈ విషయాలను రివీల్ చేశాడు. ప్రత్యేకించి జాన్వీ గురించి చెబుతూ.. తను బ్యూటిఫుల్, టాలెంటెడ్ అండ్ అట్రాక్టివ్ గర్ల్ అని తెలిపాడు. రానున్న రోజుల్లో జాన్వీని పెద్ద మూవీ స్టార్‌గా చూస్తామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సొంత సిస్టర్ సోనమ్‌‌పై ప్రశంసలు వర్షం కురిపించాడు. తనను గ్రేట్ యాక్టర్ అండ్ ఫ్యాషన్ ఐకాన్‌గా అభివర్ణించాడు. అంతేకాదు సొసైటీ, ప్రజల కోసం సోనమ్ చాలా చేస్తుందని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News