HYDలో ‘గ్రీన్ కవరేజీ’ కలేనా..?

దిశ, మల్కాజిగిరి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అల్వాల్ సర్కిల్​లో నత్తనడకన సాగుతోంది. సర్కిల్ మొత్తంలో 16 వేల పైచిలుకు మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9,500 మొక్కలు మాత్రమే నాటడమే ఇందుకు నిదర్శనం. జూన్ లో హరితహారం ప్రారంభంకాగా, మూడు నెలలు గడిచినా అధికారుల నిర్లక్ష్యంతో 60 శాతం కూడా పూర్తి కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా స్థానిక శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఇటీవల అల్వాల్ డివిజన్, చంద్రపురి […]

Update: 2020-09-06 02:41 GMT

దిశ, మల్కాజిగిరి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అల్వాల్ సర్కిల్​లో నత్తనడకన సాగుతోంది. సర్కిల్ మొత్తంలో 16 వేల పైచిలుకు మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9,500 మొక్కలు మాత్రమే నాటడమే ఇందుకు నిదర్శనం. జూన్ లో హరితహారం ప్రారంభంకాగా, మూడు నెలలు గడిచినా అధికారుల నిర్లక్ష్యంతో 60 శాతం కూడా పూర్తి కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా స్థానిక శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఇటీవల అల్వాల్ డివిజన్, చంద్రపురి కాలనీలో జరిగిన ఓ సమావేశంలో బహిరంగంగా ఈ పథకం అమలు తీరుపై విమర్శలు చేశారు. అల్వాల్ సర్కిల్​లో హరితహారం సరిగ్గా జరుగడం లేదని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వద్ద మాటపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు వేదికనుంచే ఫోన్​లో ఫిర్యాదు చేశారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డిసెంబర్ వరకు పూర్తిచేస్తాం..

సర్కిల్​లో ఇప్పటి వరకు 9,500 మొక్కలు నాటాం. ఒక్క బొల్లారంలో 8 వేల మియావాకీ మొక్కలు నాటాము. రేల్ నగర్లో 400, సీతల్ ఎన్​క్లేవ్​లో 300, బొల్లారం రైల్వే స్టేషన్ నుంచి ఐస్​ఫ్యాక్టరీ వరకు రోడ్డుకు ఇరువైపులా 600, రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో 300, చంద్రపురి కాలనీలో 300 చొప్పున దాదాపుగా 9,500 వరకు మొక్కలు నాటాం. మిగిలిన మొక్కలను నాటేందుకు అన్ని సిద్ధం చేస్తున్నాం. హరితహారం కార్యక్రమం పూర్తి చేసేందుకు డిసెంబర్, జనవరి వరకు అవకాశం ఉంది.

-మేనేజర్ అనిల్ కుమార్

Tags:    

Similar News