దసరాను మించిన పండుగ లేదు: హరీశ్ రావు
దిశ, సిద్దిపేట: విజయదశమి పర్వదినం సందర్భంగా సిద్ధిపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని.. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా పండుగలో మన సంప్రదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత ఉన్నదని మంత్రి అన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. […]
దిశ, సిద్దిపేట: విజయదశమి పర్వదినం సందర్భంగా సిద్ధిపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని.. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా పండుగలో మన సంప్రదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత ఉన్నదని మంత్రి అన్నారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని ఈ పర్వదినాన దుర్గ, రేణుకా ఎల్లమ్మ అమ్మవార్లను వేడుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా పండుగ రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.
ఇమాంబాద్ లో దుర్గామాత శోభాయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్
దసరా పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణ 15 వ మున్సిపాలిటీ వార్డు ఇమాంబాద్ లో దుర్గామాత అమ్మవారి శోభయాత్రకు మంత్రి హరీశ్ రావు హాజరై అమ్మవారి నిమజ్జన యాత్రను ప్రారంభించారు. ప్రతి ఏటా అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా విజయ దశమి రోజునే నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతీయేటాలాగే ఈ యేడు మంత్రి అమ్మవారి శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, ఇతర మండలాల నాయకులతోపాటు వార్డు కౌన్సిలర్ పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జక్కుల రాజయ్య, హిందువాహిని ప్రతునిధులు నాయిని మధుసూదన్ రెడ్డి, జక్కుల శేఖర్, దమ్ము కరుణాకర్ రెడ్డి, కవ్వం అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.