ఆయన తెలంగాణ కోసం జీవితాంతం పోరాడారు: హరీష్ రావు

దిశ, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్‎లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారు అని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం […]

Update: 2021-08-06 05:24 GMT

దిశ, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్‎లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారు అని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారనీ తెలిపారు. జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్యత్ త‌రాల‌కు మార్గద‌ర్శకాలుగా మారాయన్నారు.

Tags:    

Similar News