పంజాల స్వప్నకి ప్రమాద బీమా అందించిన మంత్రి హరీష్ రావు

దిశ, కొండపాక : కొండపాక మండలం దుద్దేడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పంజాల చంద్రశేఖర్ గౌడ్ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మంత్రి హరీష్ రావుకు విషయం తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి చొరవ తీసుకుని పంజాల చంద్రశేఖర్ గౌడ్ భార్య పంజాల స్వప్నకి శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ భవన్ ఇన్సూరెన్స్ ఇంచార్జ్ […]

Update: 2021-12-03 05:35 GMT

దిశ, కొండపాక : కొండపాక మండలం దుద్దేడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పంజాల చంద్రశేఖర్ గౌడ్ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మంత్రి హరీష్ రావుకు విషయం తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి చొరవ తీసుకుని పంజాల చంద్రశేఖర్ గౌడ్ భార్య పంజాల స్వప్నకి శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ భవన్ ఇన్సూరెన్స్ ఇంచార్జ్ భరత్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ రూ.2 లక్షల ప్రోసిడింగ్ కాపీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ దుద్దేడ గ్రామ అధ్యక్షుడు చిలుముల రాం మోహన్, టిఆర్ఎస్ పార్టీ దుద్దెడ గ్రామ యూత్ అధ్యక్షుడు చిక్కుడు భాను ముదిరాజ్,నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News