ఓటుకు 2వేలు ఇస్తారు.. తెల్లారే సిలిండర్ ధరను పెంచుతారు : హరీశ్ రావు
దిశ, హుజురాబాద్ : ఈటల తన బాధను ప్రజలపై రుద్దుతున్నాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్‌లో ఇందిరమ్మ గృహాలు పొంది.. ఇంటి అనుమతులు లేని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్ మీటర్ మార్పు వంటి పత్రాలను అందజేయటం జరుగుతుందని తెలిపారు. ఈ ఉప […]
దిశ, హుజురాబాద్ : ఈటల తన బాధను ప్రజలపై రుద్దుతున్నాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్‌లో ఇందిరమ్మ గృహాలు పొంది.. ఇంటి అనుమతులు లేని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్ మీటర్ మార్పు వంటి పత్రాలను అందజేయటం జరుగుతుందని తెలిపారు.
ఈ ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీకి ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలకు మద్దతు తెలిపినట్టే అవుతుందని పేర్కొన్నారు. ఒక్కరోజు ఓటుకు రెండు వేలు చేతిలో పెడుతారని.. మరుసటి రోజు సిలిండర్ ధరను అమాంతం పెంచుతారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పే వారి వైపు ఉంటారా.. లేక ధర్మం, న్యాయం వైపు ఉంటారా.? అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.