'తెల్లరేషన్ కార్డుదారులకు రూ.3 వేలు ఇవ్వండి'
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. అలాగే రైతుల కోసం రైతు నవరత్నాలు పేరుతో 9 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు బుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల రేట్లు విపరీతంగా […]
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. అలాగే రైతుల కోసం రైతు నవరత్నాలు పేరుతో 9 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు బుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. సామాన్యుడు బతకడమే చాలా కష్టంగా మారిందని అన్నారు.
ఈ పరిణామాల నుంచి ప్రజలు బయటపడాలంటే తెల్లరేషన్ కార్డు దారులకు నెలకు రూ.3వేలు ఆర్థిక సాయం చేయాలని లేఖలో కోరారు. మరోవైపు కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి లక్ష ఉత్తరాలు రాశామని, అయినా జగన్ స్పందించలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ అవసరమైతే రిలే నిరాహర దీక్షలు చేపట్టేందుకు సన్నద్ధమవుతామని లేఖలో పేర్కొన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు దూరం పెట్టి ప్రజలు శాంతియుతంగా, ధైర్యంగా బతికేలా పాలన అందించాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.