ఐపీఎల్‌కు హర్భజన్ 10 రోజులు దూరం

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు సభ్యుడైన వెటరన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆలస్యం కానున్నట్టు సమాచారం. సీఎస్కే జట్టు శుక్రవారం చెన్నై నుంచి యూఏఈకి బయల్దేరనుంది. అయితే హర్భజన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతను 10 రోజుల తర్వాత యూఏఈ వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. గత నాలుగు రోజులుగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సీఎస్కే జట్టు సభ్యులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో కూడా హర్భజన్ పాల్గొనలేదు. ధోనీ, […]

Update: 2020-08-20 10:54 GMT

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు సభ్యుడైన వెటరన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆలస్యం కానున్నట్టు సమాచారం. సీఎస్కే జట్టు శుక్రవారం చెన్నై నుంచి యూఏఈకి బయల్దేరనుంది. అయితే హర్భజన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతను 10 రోజుల తర్వాత యూఏఈ వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. గత నాలుగు రోజులుగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సీఎస్కే జట్టు సభ్యులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో కూడా హర్భజన్ పాల్గొనలేదు.

ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి క్రికెటర్లు ఆ శిబిరంలో పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో హర్బజన్, రవీంద్ర జడేజాలు ఈ శిబిరంలో పాల్గొనలేదు. హర్భజన్ 10 రోజుల తర్వాత దుబాయ్ వెళ్లనుండగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లుంగి ఎంగిడి, డూప్లెసిస్ నేరుగా దుబాయ్ వెళ్తారు. ఇక సీపీఎల్‌లో ఆడుతున్న ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో, మిచెల్ శాంట్నర్‌లు కూడా ఆలస్యంగా యూఏఈ చేరుకోనున్నట్టు సీఎస్కే యాజమాన్యం తెలిపింది.

Tags:    

Similar News