బ్రేకింగ్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్పిన్నర్ హర్భజన్ సింగ్

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్​(41) అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌‌లో తాను క్రికెట్‌ను ఎంతో ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన వయసును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ చివరి సారిగా 2015లో ఇంటర్నేషనల్​మ్యాచ్‌లో ఆడాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో బజ్జీ […]

Update: 2021-12-24 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్​(41) అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌‌లో తాను క్రికెట్‌ను ఎంతో ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన వయసును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ చివరి సారిగా 2015లో ఇంటర్నేషనల్​మ్యాచ్‌లో ఆడాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో బజ్జీ KKR టీమ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

కేరీర్ రికార్డు ..

103 టెస్టుల్లో 417 వికెట్లు.. వన్డేల్లో 236 మ్యాచ్‌ల్లో 269 వికెట్లు, టీ20ల్లో 28 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసుకోగా.. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.

Tags:    

Similar News