ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లకు లైన్ క్లియర్

దిశ, స్పోర్ట్స్: కరోనా పరీక్షలో పాజిటివ్ రావడంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు చెందిన 10మంది క్రికెటర్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లలేదు. కేవలం నెగెటివ్ వచ్చిన 20మంది ఆటగాళ్లు, 11మంది సిబ్బంది ప్రత్యేక విమానంలో ఆదివారం ఇంగ్లండ్ చేరుకున్నారు. కాగా, పాజిటివ్ వచ్చిన 10మందికి మరోసారి పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాక్ క్రికెటర్లలో ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ హస్నేన్‌, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, షాదబ్‌ ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌లకు తాజాగా మరోసారి […]

Update: 2020-06-30 08:38 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా పరీక్షలో పాజిటివ్ రావడంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు చెందిన 10మంది క్రికెటర్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లలేదు. కేవలం నెగెటివ్ వచ్చిన 20మంది ఆటగాళ్లు, 11మంది సిబ్బంది ప్రత్యేక విమానంలో ఆదివారం ఇంగ్లండ్ చేరుకున్నారు. కాగా, పాజిటివ్ వచ్చిన 10మందికి మరోసారి పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాక్ క్రికెటర్లలో ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ హస్నేన్‌, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, షాదబ్‌ ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌లకు తాజాగా మరోసారి నెగిటివ్‌ వచ్చింది. వీరికి నాలుగు రోజుల క్రితం చేసిన పరీక్షలో కూడా నెగెటివ్ వచ్చింది. దీంతో ఈ ఆరుగురు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్‌కు పీసీబీ చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అతను సొంతంగా ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని వచ్చింది. ఇప్పుడు పీసీబీ రెండోసారి చేసిన పరీక్షలో కూడా నెగెటివ్ రావడంతో అతడిని ఇంగ్లండ్‌కు పంపించడానికి బోర్డు అంగీకరించింది.

Tags:    

Similar News