వృద్ధుడితో యువతి ప్రేమాయణం.. ఇద్దరు కలిసి?

దిశ, వెబ్‌డెస్క్: ఓ వృద్ధుడితో యువతి ప్రేమాయణం.. వారిద్దరినీ ఇండ్లు వదిలి పారిపోయేలా చేసింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనడానికి వీళ్లు ఆదర్శంగా నిలుస్తారే లేదో తెలియదు గానీ.. కుటుంబీకుల పరువుకు మాత్రం భంగం తెచ్చారు. గత నెల జరిగిన ఈ వ్యవహారం.. కోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ పఠాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడి స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. గుజరాత్‌లోని పఠాన్ జిల్లా సిధాపూర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. […]

Update: 2020-07-11 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వృద్ధుడితో యువతి ప్రేమాయణం.. వారిద్దరినీ ఇండ్లు వదిలి పారిపోయేలా చేసింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనడానికి వీళ్లు ఆదర్శంగా నిలుస్తారే లేదో తెలియదు గానీ.. కుటుంబీకుల పరువుకు మాత్రం భంగం తెచ్చారు. గత నెల జరిగిన ఈ వ్యవహారం.. కోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ పఠాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడి స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది.

గుజరాత్‌లోని పఠాన్ జిల్లా సిధాపూర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తమ కూతురు కనిపించడం లేదని.. అదే సమయం నుంచి ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు కూడా మాయమయ్యాడని.. తమ కూతురిని అతడే ఎక్కడికో తీసుకెళ్లాడంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 2 న బయటకు వెళ్లిన తమ కూతురు ఎంతకీ తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆ వృద్దుడితో చనువు ఉండేవాడని అతడిపై బాధిత తల్లిదండ్రులు అనుమానం కూడా వ్యక్తం చేశారు.

అయితే, ఈ కేసును తేలిగ్గా తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని వారిని పంపించివేశారు. దీంతో ఆ యువతి సోదరుడు గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన సోదరిని ఆ వృద్దుడే కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధిస్తున్నాడని పిటిషన్‌లో వెల్లడించాడు. వీలైనంత తొందరగా తనను రక్షించాలని కోర్టును వేడుకోవడం గమనార్హం. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పోలీసుల తీరుపై మండిపడింది. అలాగే, బాధితురాలిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, జూన్ 29న కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితురాలిని హాజరుపర్చాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా, పోలీసులు దర్యాప్తులో విఫలం అయ్యారు. దీంతో మరో రెండు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ లోపు ప్రవేశపెట్టాలని తేల్చి చెప్పింది. దీనికి మరో కొద్ది గంటలే సమయం ఉండడంతో కేసు మరింత ఆసక్తి కరంగా మారింది.

Tags:    

Similar News