పాన్ మసాలా పేరుతో గుట్కా తయారీ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా గుట్కా బ్లాక్ మార్కెట్ మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రజలంతా ప్రాణభయంతో వణుకుతుంటే వీళ్లేమో కాసుల వేటలో మునిగిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ గుట్కాకేంద్రంపై దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం కొప్పురాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కొందరు దుండగులు పాన్ మసాలా తయారీ కోసమని అనుమతి తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా గుట్కా బ్లాక్ మార్కెట్ మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రజలంతా ప్రాణభయంతో వణుకుతుంటే వీళ్లేమో కాసుల వేటలో మునిగిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ గుట్కాకేంద్రంపై దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం కొప్పురాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం..కొందరు దుండగులు పాన్ మసాలా తయారీ కోసమని అనుమతి తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా తయారు చేస్తున్నారు. దీనిని టెంపర్ బ్రాండ్ పేరుతో బయట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా సమయంలో ఎమర్జెన్సీ డెలివరీ పేరుతో వాహనాలకు అనుమతి తీసుకుని అందులో ఈ గుట్కాను భారీగా తరలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు దాడుల్లో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీంతో గుట్కా తయారు చేస్తున్నా ముఠాను అరెస్టు చేసి.. భారీగా గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.