ఎఫ్ఐహెచ్ హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రకటన
దిశ, స్పోర్ట్స్: ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డుల్లో భారత హాకీ ప్లేయర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుష, మహిళల జట్లు అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా.. మహిళల జట్టు తృటిలో పతకం కోల్పోయింది. పురుషుల్లో హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల్లో గుర్జిత్ కౌర్ ప్లేయర్ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళా జట్టు గోల్ కీపర్ సవిత, పురుషుల జట్టు […]
దిశ, స్పోర్ట్స్: ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డుల్లో భారత హాకీ ప్లేయర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుష, మహిళల జట్లు అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా.. మహిళల జట్టు తృటిలో పతకం కోల్పోయింది. పురుషుల్లో హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల్లో గుర్జిత్ కౌర్ ప్లేయర్ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళా జట్టు గోల్ కీపర్ సవిత, పురుషుల జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ లకు ఉత్తమ గోల్ కీపర్ అవార్డులు దక్కాయి. ఇక షర్మిల దేవి, వివేక్ ప్రసాద్‌లకు బెస్ట్ రైజింగ్ స్టార్ అవార్డులు లభించాయి. భారత మహిళా జట్టు కోచ్ మరీనే, పరుషుల జట్టు కోచ్ గ్రాహమ్ రెయిడ్ ఉత్తమ కోచ్‌లుగా అత్యధిక ఓట్లు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 79 జాతీయ అసోసియేషన్లకు చెందిన కెప్టెన్లు, కోచ్‌లతో పాటు 3 లక్షల మంది ఫ్యాన్స్ ఈ అవార్డుల ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్లను నేషనల్ అసోసియేషన్లు, ఫ్యాన్స్ అండ్ ప్లేయర్స్, మీడియా కేటగిరీలు విభజించగా.. ఈ మూడింటిలోనూ భారత హాకీ ప్లేయర్లు టాప్ ర్యాంకులు సాధించడం గమనార్హం.