గురుద్వారాలో ‘ఆక్సిజన్ లంగర్’.. బాధితులకు ఉచితం

దిశ, ఫీచర్స్: ప్రతీరోజు లక్షలమంది ఆకలి తీర్చే స్వర్ణదేవాలయంలోని ‘లంగర్’.. లాక్‌డౌన్‌ సమయంలోనూ అన్నార్తుల కడుపు నింపింది. ప్రస్తుతం ప్రాణవాయువు అందక రోజుకు పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గురుద్వారా నిర్వాహకులు ‘ఆక్సిజన్ లంగర్’‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఘజియాబాద్, ఇందిరాపురంలోని గురు సింగ్ సభ, ఖల్సా హెల్ప్ ఇంటర్నేషనల్ అనే ఎన్జీఓతో కలిసి గురుద్వారా ప్రాంగణంలో ‘ఆక్సిజన్ లంగర్’ ఏర్పాటు చేశారు. […]

Update: 2021-04-25 02:40 GMT

దిశ, ఫీచర్స్: ప్రతీరోజు లక్షలమంది ఆకలి తీర్చే స్వర్ణదేవాలయంలోని ‘లంగర్’.. లాక్‌డౌన్‌ సమయంలోనూ అన్నార్తుల కడుపు నింపింది. ప్రస్తుతం ప్రాణవాయువు అందక రోజుకు పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గురుద్వారా నిర్వాహకులు ‘ఆక్సిజన్ లంగర్’‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

ఘజియాబాద్, ఇందిరాపురంలోని గురు సింగ్ సభ, ఖల్సా హెల్ప్ ఇంటర్నేషనల్ అనే ఎన్జీఓతో కలిసి గురుద్వారా ప్రాంగణంలో ‘ఆక్సిజన్ లంగర్’ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్‌ అవసరమైన వారు వెంటనే బుక్ చేసుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్‌(9097041313) కూడా ప్రారంభించినట్లు సిక్కు వలంటీర్లు తెలిపారు. ‘తమకు ప్రతీరోజు వందల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తుండటంతో మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం మరికొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటి వరకు 200 మంది ప్రాణాలను రక్షించగలిగాం.. అయితే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికి లేదా ఆస్పత్రికి ఇవ్వడం లేదు. తమ వాహనంలో రోగితో పాటు ఇందిరాపురం గురుద్వారా వద్దకు వస్తే వారికి ఆక్సిజన్ అందిస్తాం. ఆక్సిజన్ లెవల్స్ సురక్షిత స్థాయికి చేరే వరకు లేదా ఆస్పత్రిలో బెడ్ దొరికే వరకు ప్రాణవాయువు అందిస్తాం. ఆక్సిజన్ ‘సేవా’ అందరికీ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇక్కడికే రావాలని మేము ప్రజలను కోరుతున్నాం. ఘజియాబాద్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్, ఎంపీ వీకే సింగ్‌లను 12 గంటల పాటు 25 ఆక్సిజన్ సిలిండర్లను మాకు అందించాలని అభ్యర్థిస్తున్నాం. ఇది 1000 మంది ప్రాణాలను రక్షించడంలో మాకు సాయపడుతుంది’ అని గురుద్వారా వలంటీర్లు వెల్లడించారు.

గురుద్వారా.. ప్రజలకు మందులతో పాటు పరీక్షా సౌకర్యాలను కూడా అందిస్తోంది. ఇక ‘ఆక్సిజన్ లంగర్’ వార్త సోషల్ మీడియాలో వ్యాప్తికావడంతో రోగులు, వారి బంధువులు గురుద్వారాకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గురుద్వారా సేవలకు సర్వత్రా ప్రశంసలు దక్కుతుండగా, ట్విట్టర్‌లో #OxygenInDelhi #OxygenLangar #CovidEmergency ట్రెండింగ్‌లో నిలిచాయి. అంతేకాదు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బాధితులకు భోజనం అందించడంలోనూ గురుద్వారా వలంటీర్లు పెద్ద మనసు చాటుకుంటున్నారు.

Tags:    

Similar News