మేము 500 మందికి భోజనం పెడతాం: గుంటూరు అర్బన్ బీజేపీ
రోజూ 500 మందికి భోజనం పెట్టేందుకు గుంటూరు పట్టణ బీజేపీ విభాగం ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో గుంటూరులో వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెడ్‌జోన్‌లో ఉంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలు, నిరాశ్రయులు, యాచకులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 500 మందికి భోజన సౌకర్యం కల్పిస్తామని గుంటూరు అర్బన్ బీజేపీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు. లాక్‌డౌన్ ముగిసేంతవరకు తాము భోజనం పెడతామని ఆయన […]
రోజూ 500 మందికి భోజనం పెట్టేందుకు గుంటూరు పట్టణ బీజేపీ విభాగం ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో గుంటూరులో వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెడ్‌జోన్‌లో ఉంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలు, నిరాశ్రయులు, యాచకులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 500 మందికి భోజన సౌకర్యం కల్పిస్తామని గుంటూరు అర్బన్ బీజేపీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు. లాక్‌డౌన్ ముగిసేంతవరకు తాము భోజనం పెడతామని ఆయన చెప్పారు.
tags: ap, guntur, bjp, food for free, lockdown, food distribution