రెడ్‌జోన్‌లో గుంటూరు, కర్నూలు..ఇంతకీ రెడ్‌జోన్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కేవలం ఈ జిల్లాల్లోనే కాకుండా వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండ్‌జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా 81 రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. ఇంతకీ ఆ రెడ్ జోన్ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి ఆంక్షలు అమలులో ఉంటాయి అన్న వివరాల్లోకి వెళ్తే… కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌లు అంటారు. ఈ ప్రాంతాల్లో […]

Update: 2020-04-12 01:12 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కేవలం ఈ జిల్లాల్లోనే కాకుండా వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండ్‌జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా 81 రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. ఇంతకీ ఆ రెడ్ జోన్ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి ఆంక్షలు అమలులో ఉంటాయి అన్న వివరాల్లోకి వెళ్తే… కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌లు అంటారు. ఈ ప్రాంతాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తారు.

ఇక్కడి ప్రజలు ఎవరూ బయటకు వచ్చేందుకు వీలు లేదు. వీధిలోకి కాదుగదా… కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీల్లేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు సరఫరా చేస్తారు. అలా సరఫరా అయిన వాటిని ఆ ఇంట్లోని ఒక్క వ్యక్తే బయటకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జోన్‌లోని ప్రజలు ఎంతో అత్యవసరమైతే, అది కూడా పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సి వుంటుంది. ఈ ప్రాంతంలోకి బయటివారెవరికీ అనుమతి ఉండదు. రెడ్ జోన్ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రభుత్వాధికారులు చేపడతారు. ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయిస్తుంటారు.

ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. అక్కడికి దారితీసే రహదారులన్నింటినీ అన్ని వైపులనుంచి బారికేడ్లతో మూసేస్తారు. అలాగే వాటి దగ్గర రెడ్‌జోన్ అని సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతాల్లో 24 గంటలూ పోలీసు గస్తీ ఉంటుంది. గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో మహమ్మారి ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను అంటిస్తారు.

ఇక ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండు సార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తుంటారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేకరించి, క్వారంటైన్ చేస్తారు. రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలుంటాయి. ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తారు. లేని పక్షంలో ఈ ఆంక్షలు మరో 14 రోజులు కొనసాగుతాయి. తద్వారా కరోనా పాజిటివ్ కేసులు తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags: coronavirus, covid-19, red zones, quarantine, police restrictions

Tags:    

Similar News