వరంగల్ మేయ‌ర్ అభ్యర్థిగా గుండు సుధారాణి..?

దిశ‌ ప్రతినిధి, వరంగ‌ల్ : టీఆర్ఎస్ అధిష్ఠానం సీనియ‌ర్ నేత నాగుర్ల వెంక‌టేశ్వర్లుకు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈసారి కాబోయే మేయ‌ర్ అంటూ ఎన్నికలు మొద‌లుకాక ముందు నుంచే ఆయ‌న పేరు జోరుగా వినిపించింది. ఆయ‌న పోటీ చేయ‌డం ఖాయం, మేయ‌ర్ అయిపోవ‌డం త్వర‌లోనే జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు, ఆయ‌న స‌న్నిహితులు భావిస్తున్న త‌రుణంలో మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరు తెర‌పైకి వ‌స్తోంది. గుండు సుధారాణి పేరు దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా తెలుస్తోంది. ఆమె పేరును నేరుగా ముఖ్యమంత్రి […]

Update: 2021-04-18 00:17 GMT

దిశ‌ ప్రతినిధి, వరంగ‌ల్ : టీఆర్ఎస్ అధిష్ఠానం సీనియ‌ర్ నేత నాగుర్ల వెంక‌టేశ్వర్లుకు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈసారి కాబోయే మేయ‌ర్ అంటూ ఎన్నికలు మొద‌లుకాక ముందు నుంచే ఆయ‌న పేరు జోరుగా వినిపించింది. ఆయ‌న పోటీ చేయ‌డం ఖాయం, మేయ‌ర్ అయిపోవ‌డం త్వర‌లోనే జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు, ఆయ‌న స‌న్నిహితులు భావిస్తున్న త‌రుణంలో మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరు తెర‌పైకి వ‌స్తోంది. గుండు సుధారాణి పేరు దాదాపుగా ఖ‌రారైన‌ట్లుగా తెలుస్తోంది. ఆమె పేరును నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నేత‌ల‌కు సూచించిన‌ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె రాజ‌కీయ అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డంతో పాటు, బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌న్న అభిప్రాయంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఆమె ఎంపిక‌కు మొగ్గు చూపిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో మిగ‌తా బీసీ జ‌న‌ర‌ల్ రిజ‌ర్వేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు మ‌హిళ‌కే అవ‌కాశం క‌ల్పించాల‌ని భావిస్తోందంట‌. అనేక కోణాల్లో ఆలోచించి ఆమె ఎంపిక‌కే చివ‌ర‌కు మొగ్గు చూపిన‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి విశ్వస‌నీయ స‌మాచారం. సుధారాణి ఆదివారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. నాగుర్లతో పాటు మ‌రో న‌లుగురు కూడా మేయ‌ర్ ప‌ద‌విపై మొద‌ట్నుంచి ఆశ‌లు పెట్టుకున్నారు. వారికి ద‌గ్గర‌గా ఉన్న నేత‌ల‌తో ప్రయ‌త్నాలు చేశారు. ఇప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉండ‌బోతోంద‌న్నది వేచి చూడాలి.

Tags:    

Similar News