మహిళా సారథులు.. గ్రేటర్ వరంగల్ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పూర్తి!

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్‌గా గుండు సుధారాణి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా రిజ్వాన ష‌మీమ్ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది.ముఖ్యమంత్రి కేసీఆర్ సూచ‌న‌ల‌తో పార్టీ అధిష్టానం మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ క‌వ‌ర్‌లో పంపింది. అధిష్టానం సూచించిన అభ్యర్థుల‌కు ఓటు వేయాల‌ని కార్పోరేట‌ర్లకు, ఎన్నిక‌ల బాధ్యత‌ను చేప‌ట్టిన‌ మంత్రులు అల్లొల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్లు నూత‌నంగా ఎన్నికైన జీడ‌బ్ల్యూఎంసీ కార్పోరేట‌ర్లకు చెప్పారు. అంత‌కుముందు ఉద‌యం మంత్రులు […]

Update: 2021-05-07 04:44 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్‌గా గుండు సుధారాణి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా రిజ్వాన ష‌మీమ్ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది.ముఖ్యమంత్రి కేసీఆర్ సూచ‌న‌ల‌తో పార్టీ అధిష్టానం మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ క‌వ‌ర్‌లో పంపింది. అధిష్టానం సూచించిన అభ్యర్థుల‌కు ఓటు వేయాల‌ని కార్పోరేట‌ర్లకు, ఎన్నిక‌ల బాధ్యత‌ను చేప‌ట్టిన‌ మంత్రులు అల్లొల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్లు నూత‌నంగా ఎన్నికైన జీడ‌బ్ల్యూఎంసీ కార్పోరేట‌ర్లకు చెప్పారు.

అంత‌కుముందు ఉద‌యం మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎమ్మెల్యే, రాజ‌య్య ఎమ్మెల్సీలు సార‌య్య, క‌డియం శ్రీహ‌రి త‌దిత‌రులు హ‌రితహోట‌ల్‌లో టీఆర్‌ఎస్ కార్పోరేట‌ర్లతో సమన్వయ స‌మావేశం నిర్వహించారు. పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా క‌ట్టుబ‌డి ఉండాల‌ని సూచించారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 2గంట‌ల స‌మ‌యంలో అభ్యర్థుల పేర్లను వెల్లడించి చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక‌ను పూర్తి చేశారు.

Tags:    

Similar News