బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీకి మూడ్రోజులు సెలవు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గులాబ్ తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున, వర్షాల కారణంగా నియోజకవర్గాల్లో తలెత్తిన ఇబ్బందులను, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు అసెంబ్లీ సెషన్‌ను వాయిదా వేయాల్సిందిగా పలువురు సభ్యులు స్పీకర్‌కు, మండలి ప్రొటెమ్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల సభ్యులను సంప్రదించిన తర్వాత వరుసగా మూడ్రోజుల పాటు అసెంబ్లీ […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గులాబ్ తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున, వర్షాల కారణంగా నియోజకవర్గాల్లో తలెత్తిన ఇబ్బందులను, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు అసెంబ్లీ సెషన్‌ను వాయిదా వేయాల్సిందిగా పలువురు సభ్యులు స్పీకర్‌కు, మండలి ప్రొటెమ్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల సభ్యులను సంప్రదించిన తర్వాత వరుసగా మూడ్రోజుల పాటు అసెంబ్లీ వాయిదా వేయాలని నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శి ఈ విషయాన్ని బులెటిన్ ద్వారా తెలిపారు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగవు. తిరిగి అక్టోబర్ 1న ఉభయ సభలు యథావిధిగా సమావేశం అవుతాయని స్పీకర్ స్పష్టం చేశారు.