ఆగష్టులో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(GST) ఆగష్టు నెలలో రూ. 86,449 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు మంగళవారం వెల్లడించాయి. జులైలో వసూలైన రూ. 87,422 కోట్ల కంటే ఈసారి తగ్గాయి. గతేడాది ఆగష్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 98,202 కోట్లు వసూలయ్యాయి. ఆగష్టు నెలలో జరిగిన వసూళ్లలో సీజీఎస్‌టీ రూ. 15,906 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 21,064 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ. 42,264 కోట్లు(దిగుమతిపై వసూలు చేసిన రూ .19,179 కోట్లతో […]
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(GST) ఆగష్టు నెలలో రూ. 86,449 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు మంగళవారం వెల్లడించాయి. జులైలో వసూలైన రూ. 87,422 కోట్ల కంటే ఈసారి తగ్గాయి. గతేడాది ఆగష్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 98,202 కోట్లు వసూలయ్యాయి. ఆగష్టు నెలలో జరిగిన వసూళ్లలో సీజీఎస్‌టీ రూ. 15,906 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 21,064 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ. 42,264 కోట్లు(దిగుమతిపై వసూలు చేసిన రూ .19,179 కోట్లతో సహా) సమకూరినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది.
సెస్ రూపంలో రూ .7,215 కోట్లు వచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. చాలామంది చిన్న వ్యాపారులు తమ నెలవారీ రిటర్నులను దాఖలు చేయకపోవడమే ఈ క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ‘రూ. 5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ వరకు రిటర్న్స్ దాఖలు చేయడంలో సడలింపును కొనసాగిస్తున్నారని కూడా గమనించాలని’ పేర్కొంది.