అక్టోబర్‌లో రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు

దిశ, వెబ్‌డెస్క్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్ నెలకు సంబంధించి ఎనిమిది నెలల అనంతరం రూ. లక్షల కోట్ల మార్కును చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా రూ. లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లుగా జరగ్గా, మళ్లీ అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,05,155 కోట్లుగా నమోదయ్యాయి. ఈ వసూళ్లలో సీజీఎస్టీ రూ. 19,193 కోట్లుగా ఉండగా, ఎస్‌జీఎస్టీ రూ. 25,411 కోట్లు, ఐజీఎస్టీ రూ. 52,540 కోట్లుగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో వసూలైన రూ. […]

Update: 2020-11-01 03:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్ నెలకు సంబంధించి ఎనిమిది నెలల అనంతరం రూ. లక్షల కోట్ల మార్కును చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా రూ. లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లుగా జరగ్గా, మళ్లీ అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,05,155 కోట్లుగా నమోదయ్యాయి. ఈ వసూళ్లలో సీజీఎస్టీ రూ. 19,193 కోట్లుగా ఉండగా, ఎస్‌జీఎస్టీ రూ. 25,411 కోట్లు, ఐజీఎస్టీ రూ. 52,540 కోట్లుగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో వసూలైన రూ. 95 వేల కోట్లతో పోలిస్తే ఈసారి 10 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు జరిగాయని రెవెన్యూ విభాగం వెల్లడించింది.

ఈ ఏడాది మార్చి నుంచి కొవిడ్-19 వ్యాప్తి, సంబంధిత లాక్‌డౌన్ పరిణామాలతో తగ్గిపోయిన వసూళ్లు ఇటీవల ఆంక్షల సడలింపుతో మెరుగ్గా వసూళ్లయ్యాయి. జులైలో జీఎస్టీ వసూళ్లూ రూ. 87 వేల కోట్లుగా జరగ్గా, ఆగష్టులో రూ. 86 వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 95 వేల కోట్ల వసూళ్లు జరిగాయి. గత నెలలో రూ. లక్ష కోట్ల వసూళ్లు దాటడంతో దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ సంకేతంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ నెలకు జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంద్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లూ గతేడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధితో రూ. 2,480 కోట్లు ఉండగా, తెలంగాణలో 5 శాతం పెరిగి రూ. 3,383 కోట్ల వసూళ్లు జరిగాయి.

Tags:    

Similar News