రేపు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 ప్రయోగానికి కసరత్తు జరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 వాహననౌక ద్వారా 2,268 కిలోల బరువు గల జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను ఈ ఉపగ్రహాం ద్వారా తెలుసుకునే వీలు కలగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 ప్రయోగానికి కసరత్తు జరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 నింగిలోకి దూసుకెళ్లనుంది.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 వాహననౌక ద్వారా 2,268 కిలోల బరువు గల జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను ఈ ఉపగ్రహాం ద్వారా తెలుసుకునే వీలు కలగనుంది.