‘శ్రీమతి’ కోసం పదేళ్లుగా అన్వేషణ.. ఓ భర్త కథ!

దిశ, ఫీచర్స్ : రోడ్డు ప్రమాదంలో సతీమణి మరణించగా.. ఆమె జ్ఞాపకార్థం మైనపు విగ్రహాన్ని తయారు చేయించి, దానితో గృహప్రవేశం చేసిన కర్ణాటక పారిశ్రామికవేత్త గురించి తెలిసిందే. భార్యపై తనకున్న ప్రేమను ఆయన ఈ విధంగా చాటుకోగా.. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి, తన భార్య కోసం పదేళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నాడు. భూమ్మీద జనావాసాల్లోనే కాక పర్వతాలు, నదీ తీరప్రాంతాలు, ఆఖరికి సముద్రపు లోతుల్లోనూ జల్లెడ పడుతున్నాడు. ఊపిరి ఆగిపోయేంత వరకు తన భార్య కోసం […]

Update: 2021-03-12 02:03 GMT

దిశ, ఫీచర్స్ : రోడ్డు ప్రమాదంలో సతీమణి మరణించగా.. ఆమె జ్ఞాపకార్థం మైనపు విగ్రహాన్ని తయారు చేయించి, దానితో గృహప్రవేశం చేసిన కర్ణాటక పారిశ్రామికవేత్త గురించి తెలిసిందే. భార్యపై తనకున్న ప్రేమను ఆయన ఈ విధంగా చాటుకోగా.. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి, తన భార్య కోసం పదేళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నాడు. భూమ్మీద జనావాసాల్లోనే కాక పర్వతాలు, నదీ తీరప్రాంతాలు, ఆఖరికి సముద్రపు లోతుల్లోనూ జల్లెడ పడుతున్నాడు. ఊపిరి ఆగిపోయేంత వరకు తన భార్య కోసం వెతుకుతూనే ఉంటానంటున్న ఆ వ్యక్తి ఎవరంటే..

జపాన్‌లోని ఒనగావా టౌన్, మియాగి ప్రాంతానికి చెందిన యసువో తకమస్తుకు తన భార్యంటే చాలా ఇష్టం. ఓ రోజు తను పనిమీద బయటికి వెళ్లగా.. ‘ఫుకుషిమా’ అనే భయంకర సునామీ ఆ ప్రాంతాన్ని ముంచేసింది. అప్పటి నుంచి ఆయన భార్య కనిపించడం లేదు. ఆ సునామీలో 2,636 మంది మిస్ అవగా, అందులో యసువో భార్య కూడా ఉంది. 2011లో ఆ సునామీ సంభవించిన రోజున తన భార్య నుంచి ‘ఆర్ యు ఓకే? ఐ వాంట్ టు గో హోమ్’ అనే మెసేజ్ వచ్చిందని యసువో చెప్పాడు. ఇక అప్పటి నుంచి యసువో తన భార్య కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. తన సతీమణి ఇంకా ఎక్కడో చోట బతికే ఉందని భావిస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మొదట సునామీ తాకిడికి గురైన ప్రదేశానికి దగ్గర్లోని పర్వతాలు, అడవులు సెర్చ్ చేసిన యసువో.. ఆ తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో వెతకడం స్టార్ట్ చేశాడు. ఒకవేళ సముద్రంలో పడిపోయి అంతర్భాగానికి చేరుకుందేమోనని, డైవింగ్ లెస్సన్స్ నేర్చుకొని సముద్ర అంతర్భాగాల్లోనూ వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యసువో ఇప్పటి దాకా మొత్తం 500 సార్లు సముద్ర అంతర్భాగాల్లో సెర్చ్ చేశాడు.

తన భార్య ఇక్కడ దగ్గర్లోనే ఉందేమోనని తనకు ఎప్పుడూ అనిపిస్తోందంటున్న 64 ఏళ్ల యసువోకు సముద్ర అంతర్భాగాల్లో, ఇతర ప్రదేశాల్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో ఇతర మిస్సింగ్ పర్సన్స్ బిలాంగిగ్స్ లభించాయి. కానీ అతడి భార్యకు సంబంధించిన ఏ వస్తువు దొరకలేదు. అయితే దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ అన్వేషణలో తనకు ‘ఆమె’ జాడ దొరకలేదు. అయినా తను తన ప్రయత్నాలను విరమించబోనని, ప్రతీ వారం డైవింగ్ సూట్ ధరించి సముద్ర అంతర్భాగంలో సెర్చ్ కొనసాగిస్తానని, తన ప్రియమైన శ్రీమతి జాడ తెలుసుకోవడం తనకు ముఖ్యమని యసువో చెప్పడం విశేషం.

Tags:    

Similar News