వైరల్‌గా పబ్జీ అంతిమ వీడ్కోలు!

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరు చనిపోయినా.. అంతిమ సంస్కరణలు నిర్వహించి వీడ్కోలు చెప్పడం సహజం. అయితే, ఈ మధ్య పాపులర్ గేమ్స్ నిషేధిస్తే.. వాటికి కూడా ఇదే తరహా తంతు నిర్వహించడం గేమర్స్‌కు ఓ అలవాటుగా మారింది. ఇటీవల భారత ప్రభుత్వం ‘టిక్‌టాక్’ను బ్యాన్ చేసిన సందర్భంలో.. చాలా మంది టిక్‌టాక్ రిప్ అంటూ.. దానికి దండ వేస్తూ రకరకాలుగా ఫేర్‌వెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పబ్జీ వంతు వచ్చింది. ఇటీవల కాలంలో అత్యంత […]

Update: 2020-09-08 01:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరు చనిపోయినా.. అంతిమ సంస్కరణలు నిర్వహించి వీడ్కోలు చెప్పడం సహజం. అయితే, ఈ మధ్య పాపులర్ గేమ్స్ నిషేధిస్తే.. వాటికి కూడా ఇదే తరహా తంతు నిర్వహించడం గేమర్స్‌కు ఓ అలవాటుగా మారింది. ఇటీవల భారత ప్రభుత్వం ‘టిక్‌టాక్’ను బ్యాన్ చేసిన సందర్భంలో.. చాలా మంది టిక్‌టాక్ రిప్ అంటూ.. దానికి దండ వేస్తూ రకరకాలుగా ఫేర్‌వెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పబ్జీ వంతు వచ్చింది.

ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పబ్జీ టాప్ పొజిషన్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ గేమ్ వల్ల ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ ఆటలో మునిగితేలుతున్న యూత్‌కు ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. ఎంతో మంది తల్లిదండ్రులు పబ్జీ బ్యాన్‌పై ఆనందం వ్యక్తం చేస్తుండగా.. దీనిపై సోషల్‌ మీడియాలో రకారకాల మీమ్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తమకు ఇష్టమైన పబ్జీకి కొంతమంది యువకులు వినూత్నంగా వీడ్కోలు పలికారు. సదరు యువకులు ఈ గేమ్‌ యాప్‌కు అంతియ సంస్కరణలు నిర్వహించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో యువకులంతా తెల్లని దుస్తులు ధరించి.. పబ్జీ పోస్టర్‌, దానికో దండ, పెద్ద బొట్టుతె పాడెపైన వీధుల వెంట మోసుకెళ్లారు. ‘విన్నర్‌ విన్నర్‌ చికెన్‌ డిన్నర్‌’ అంటూ అరుస్తూ.. పబ్జీ బ్యాన్ అయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ‘యాద్ తేరీ ఆయేగి.. ముజ్కో బడా సాతాయేగి’ అంటూ.. బ్యాగ్రౌండ్ పాట కూడా ప్లే చేశారు. చివరగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ.. యువకులంతా కలిసి పబ్జీకి నివాళులు అర్పించారు.

భారత్‌లో పబ్జీ గేమ్‌ యాప్‌ను 50 మిలియన్‌ మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌ను మొదట దక్షిణ‌ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్‌టాప్‌ వర్షన్‌లో కూడా ఆడొచ్చు. తరువాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ టెన్‌సెన్ట్‌ పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను తీసుకొచ్చింది.

Tags:    

Similar News