పర్యావరణ కార్యక్రమం జీవితంలో భాగం కావాలి- ఎంపీ జోగినిపల్లి

దిశ, ఖైరతాబాద్: పచ్చదనాన్ని పెంపొందించేందుకు దోహదపడే పర్యావరణ కార్యక్రమాలు నిత్య జీవితంలో భాగం కావాలని ఎంపీ జోగినిపల్లి సంతోష్ అన్నారు. పంజాగుట్ట గలేరియా మాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా గణేష్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి పర్యావరణహితంగా గణేష్ ప్రతిమను తయారు చేయడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గణేష్ విగ్రహలను స్వచ్ఛమైన మట్టి కొబ్బరి నాచుతో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. […]

Update: 2021-08-30 11:51 GMT

దిశ, ఖైరతాబాద్: పచ్చదనాన్ని పెంపొందించేందుకు దోహదపడే పర్యావరణ కార్యక్రమాలు నిత్య జీవితంలో భాగం కావాలని ఎంపీ జోగినిపల్లి సంతోష్ అన్నారు. పంజాగుట్ట గలేరియా మాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా గణేష్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి పర్యావరణహితంగా గణేష్ ప్రతిమను తయారు చేయడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గణేష్ విగ్రహలను స్వచ్ఛమైన మట్టి కొబ్బరి నాచుతో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈసారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలను పొందుపరిచినట్లు తెలిపారు.‌ హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపు మేరకు విత్తనాలతో కూడిన మట్టి గణేషులు తయారుచేసి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాల తో కూడిన గణేష్ తయారీ పంపిణీ కొనసాగుతుందన్నారు. పెరుగుతున్న కాలుష్యం దాని ద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చినట్లు సంతోష్ తెలిపారు. ప్రతి ఏటా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రజలు, భక్తులు వీలైనంతవరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఉపేందర్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..