పచ్చదనం పరుచుకున్న ‘కోనేరు’.. బతుకమ్మకే గుర్తొస్తుందా..?
దిశ, బాసర : ఈ చిత్రం చూస్తే పచ్చటి మైదనంలా కనిపిస్తోంది కదూ.. కానీ, అక్కడికి వెళ్లి ఆడుకోవచ్చని అనుకుంటే పొరపాటే. అందులో అడుగు పెట్టగానే నీటిలో మునిగిపోతారు. పచ్చదనం పరుచుకున్నది ఎక్కడో కాదు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలోని కోనేరు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే కోనేరు ఇలా దర్శనమిస్తోంది. ప్రతీయేడు బతుకమ్మ పండుగకు తప్ప మిగతా రోజుల్లో ఈ కోనేరును పట్టించుకునే నాధుడే కరువయ్యారు. బాసరకు వచ్చే భక్తులకు టెంపుల్‌లో కోనేరు […]
దిశ, బాసర : ఈ చిత్రం చూస్తే పచ్చటి మైదనంలా కనిపిస్తోంది కదూ.. కానీ, అక్కడికి వెళ్లి ఆడుకోవచ్చని అనుకుంటే పొరపాటే. అందులో అడుగు పెట్టగానే నీటిలో మునిగిపోతారు. పచ్చదనం పరుచుకున్నది ఎక్కడో కాదు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలోని కోనేరు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే కోనేరు ఇలా దర్శనమిస్తోంది. ప్రతీయేడు బతుకమ్మ పండుగకు తప్ప మిగతా రోజుల్లో ఈ కోనేరును పట్టించుకునే నాధుడే కరువయ్యారు. బాసరకు వచ్చే భక్తులకు టెంపుల్‌లో కోనేరు ఉన్నదన్నసంగతి కూడా తెలియదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోనేరుకు వెళ్ళే దారికి సూచిక బోర్డు ఏర్పాటు చేసి దానిని శుభ్రపరచాలని భక్తులు కోరుతున్నారు.