ఈనెల 25 నుంచి హరితహారం: కేసీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల్లో పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని దీనికి కలెక్టర్లు, డీపీవోలు చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హరితహారం నిర్వహించేటప్పుడు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని నొక్కిచెప్పారు. వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా చెట్లు పెంచి గ్రీన్‌వాల్ (ఎత్తయిన చెట్లు పెంచడం) నిర్మించాలన్నారు. సామాజిక అడవులు ఎంత పెంచినా […]

Update: 2020-06-16 10:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజల్లో పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని దీనికి కలెక్టర్లు, డీపీవోలు చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హరితహారం నిర్వహించేటప్పుడు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని నొక్కిచెప్పారు. వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా చెట్లు పెంచి గ్రీన్‌వాల్ (ఎత్తయిన చెట్లు పెంచడం) నిర్మించాలన్నారు. సామాజిక అడవులు ఎంత పెంచినా అవి సహజ సిద్ధంగా పెరిగే అడవులకు సాటిరావని, అందుకే అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉందని, దాన్ని కాపాడాలని సూచించారు. స్మగ్లర్ల విషయలో కఠినంగా ఉండాలని, స్మగ్లర్లను గుర్తించి, పీడీయాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక జనాభా, అధిక కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచాలన్నారు. మున్సిపాలిటీల్లో పచ్చదనానికి కేటాయించిన పది శాతం నిధులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడంతో పాటు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఖాళీ జాగాల్లోకూడా చెట్లను పెంచాలని సూచించారు. తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో తెలంగాణలో చెట్లను పెంచాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ పద్ధతి అవలంభించాలన్నారు. యాదాద్రి ఫారెస్ట్ మోడల్‌గా దీనికి పేరు పెట్టాలని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News