వరంగల్ లో ఇక 66 డివిజన్లు
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 66కు పెరగబోతోంది. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రిన్సిపల్సెక్రెటరీ అరవింద్మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో 58 డివిజన్లు ఉండగా కొత్తగా మరో 8డివిజన్లు పెరగనున్నాయి. దీంతో ప్రస్తుత డివిజన్ల భౌగోళిక సరిహద్దులతో పాటు రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మిగతా జిల్లాల్లోనూ.. ఖమ్మం కార్పొరేషన్ లో డివిజన్ల సంఖ్య 60కి […]
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 66కు పెరగబోతోంది. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రిన్సిపల్సెక్రెటరీ అరవింద్మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో 58 డివిజన్లు ఉండగా కొత్తగా మరో 8డివిజన్లు పెరగనున్నాయి. దీంతో ప్రస్తుత డివిజన్ల భౌగోళిక సరిహద్దులతో పాటు రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
మిగతా జిల్లాల్లోనూ..
ఖమ్మం కార్పొరేషన్ లో డివిజన్ల సంఖ్య 60కి చేరనుంది. అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డులకు, సిద్దిపేట 43 వార్డులకు, జడ్చర్ల 27 వార్డులకు, నకిరేకల్ 20 వార్డులకు, కొత్తూరు మునిసిపాలిటీ వార్డుల సంఖ్య 12కు పెరగనున్నాయి.