12కిమీ మోసినా.. ఫలితం దక్కలేదు

దిశ ఏపీ బ్యూరో: జోరు వాన, వాహనాలు తిరగలేని దారులు, పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేదు. అయినా, గ్రామ వాలంటీర్ ధైర్యంతో డోలీ కట్టి.. టర్పాలిన్ కవర్‌ కప్పి.. డెలివరీ కోసం 12 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ తీసుకెళ్లినా బిడ్డను కాపాడలేకపోయిన ఘటన విశాఖ ఏజెన్సీ అరకులో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన బుద్రికి నెలలు […]

Update: 2020-07-08 05:30 GMT

దిశ ఏపీ బ్యూరో: జోరు వాన, వాహనాలు తిరగలేని దారులు, పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేదు. అయినా, గ్రామ వాలంటీర్ ధైర్యంతో డోలీ కట్టి.. టర్పాలిన్ కవర్‌ కప్పి.. డెలివరీ కోసం 12 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ తీసుకెళ్లినా బిడ్డను కాపాడలేకపోయిన ఘటన విశాఖ ఏజెన్సీ అరకులో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన బుద్రికి నెలలు నిండాయి. దీంతో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం సరిగా ఉండదు. దీంతో ఆమెను అటవీ ప్రాంతం గుండా తీసుకెళ్లే మార్గం తెలీక ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ సమయంలో వాలంటీర్ సుబ్బారావు ముందుకొచ్చి డోలీ కట్టి తీసుకెళ్దామని సలహా ఇచ్చాడు. మోసేందుకు అవసరమైన మనుషులను కూడా అతనే సమకూర్చాడు. అటవీ ప్రాంతంలో జోరు వాన పడుతుండగా, ఆమె పై చినుకు పడకుండా టర్పాలిన్ కవర్ కప్పి లక్ష్మీపురం మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అప్పటికే కాస్త ఆలస్యంగా కావడంతో మృత శిశువు జన్మించింది. విషయం తెలియడంతో బాధిత కుటుంబంతో పాటు, బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు.

Tags:    

Similar News