తండ్రి బాధ్యత పై స్మిత్ క్లారిటీ.. నెటిజన్ల ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటూ తమ తరగతులు పూర్తి చేసుకుంటున్నారు. అలాగే పెద్ద కంపెనీల బోర్డు మీటింగ్స్ కూడా వర్చువల్ విధానంలోనే సాగుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్, మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ ఆన్‌లైన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళా […]
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటూ తమ తరగతులు పూర్తి చేసుకుంటున్నారు. అలాగే పెద్ద కంపెనీల బోర్డు మీటింగ్స్ కూడా వర్చువల్ విధానంలోనే సాగుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్, మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ ఆన్‌లైన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళా జట్టు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నది.
ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై సౌత్ఆఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇంటి నుంచే నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో స్మిత్ కుమారుడు వచ్చి ఆ ప్రెస్ మీట్‌ను డిస్టర్బ్ చేశాడు. తన షూ లేస్ కట్టమని అడిగాడు. దీంతో ఆన్‌లైన్‌లో ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పి.. కొడుకు షూకి లేస్ కట్టాడు. ‘తండ్రి బాధ్యతలు ఎప్పడైనా నిర్వర్తించాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.