బ్రేకింగ్.. డెడ్ బాడీల పోస్ట్ మార్టంపై కేంద్రం కీలక ప్రకటన

దిశ, డైనమిక్ బ్యూరో : అనుమానాస్పదంగా మృతిచెందినా.. యాక్సిండెంటల్ డెత్స్‌కు అయినా తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. అయితే, గతంలో కరెంటు సమస్యలు ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోస్ట్ మార్టం జరిపేవారు. ఈ కారణంగా.. ఆసుపత్రిలో ఎక్కువ మృతదేహాలు ఉంటే రెండు, మూడు రోజుల పాటు మృతుల కుటుంబీకులు పోస్ట్ మార్టం కోసం వేచిచూసేవారు. అయితే, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ […]

Update: 2021-11-15 07:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అనుమానాస్పదంగా మృతిచెందినా.. యాక్సిండెంటల్ డెత్స్‌కు అయినా తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. అయితే, గతంలో కరెంటు సమస్యలు ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోస్ట్ మార్టం జరిపేవారు. ఈ కారణంగా.. ఆసుపత్రిలో ఎక్కువ మృతదేహాలు ఉంటే రెండు, మూడు రోజుల పాటు మృతుల కుటుంబీకులు పోస్ట్ మార్టం కోసం వేచిచూసేవారు.

అయితే, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్యా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. తగినన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో ఇక నుంచి రాత్రి వేళల్లో కూడా పోస్ట్ మార్టం నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

Tags:    

Similar News