ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్నింటిపై షట్‌డౌన్ విధించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికి కండిషన్స్ పెట్టింది. అందరూ శానిటైజర్ వాడాలని తెలిపింది. ఒక్కసారిగా నిన్నరాత్రి 8మంది విదేశీయులకు వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వ్యాధి మరింత మందికి సోకకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమైన పనులుంటేనే కార్యాలయాలకు రావాలని లేనియెడల ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించనున్నట్టు సమాచారం. […]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్నింటిపై షట్‌డౌన్ విధించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికి కండిషన్స్ పెట్టింది. అందరూ శానిటైజర్ వాడాలని తెలిపింది. ఒక్కసారిగా నిన్నరాత్రి 8మంది విదేశీయులకు వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వ్యాధి మరింత మందికి సోకకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమైన పనులుంటేనే కార్యాలయాలకు రావాలని లేనియెడల ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించనున్నట్టు సమాచారం. అయితే ఈనెల31 వరకు ఉద్యోగులు హైదరాబాద్‌కు రావొద్దని టీఎన్జీవో ఆదేశాలు జారీచేసింది. కాగా, ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Tags: govt jobbers holidays, cm kcr, official announcement pending, tngo