ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం, కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు 90 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం ఐటీ కంపెనీలకు మళ్లీ శుభవార్త అందించింది. ఇంతకుముందు జులై 31 వరకు ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌ను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్-డొట్ ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తి విపరీంతగా ఉండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి పని […]
దిశ, వెబ్‌డెస్క్ :
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం, కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు 90 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం ఐటీ కంపెనీలకు మళ్లీ శుభవార్త అందించింది. ఇంతకుముందు జులై 31 వరకు ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌ను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్-డొట్ ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తి విపరీంతగా ఉండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి పని చేయడం ప్రమాదకరంగా మారింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అదనంగా మరో ఐదు నెలలు పొడిగించింది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించడాన్ని నాస్కామ్ అధ్యక్షులు స్వాగతించారు. ప్రస్తుతం దాదాపు 90 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నవారే ఆఫీసులకు వెళ్తున్నారు. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో పనిచేయనున్నారని టీసీఎస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనేక కంపెనీలు మిక్స్‌డ్ వర్కింగ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నాయి. కరోనా అనంతరం ఎక్కువ భాగం ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసే పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలకు ప్రయాణ ఖర్చులు 86 శాతం తగ్గాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.