బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్
దిశ, న్యూస్‌బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, ఈ పరిశోధనలు కొవిడ్-19పై మానవాళి పోరాటంలో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు ఆవశ్యమని గవర్నర్ తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020’ అంశంపై ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్‌భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. కొవిడ్ సమస్యను […]
దిశ, న్యూస్‌బ్యూరో: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, ఈ పరిశోధనలు కొవిడ్-19పై మానవాళి పోరాటంలో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు ఆవశ్యమని గవర్నర్ తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020’ అంశంపై ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్‌భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. కొవిడ్ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, సైంటిస్టులు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్న నేపథ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నదన్నారు. భారతదేశం ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో 20శాతం సాధిస్తుందని గవర్నర్ వివరించారు. హైదరాబాద్ ‘ బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్’గా ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని, కొవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. సైన్స్‌లో మహిళా పరిశోధకులకు, ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటి ప్రిన్సిపల సెక్రటరీ జయేష్ రంజన్, యూనివర్సిటీ రెక్టార్ గోవర్థన్, మంజూర్ హుస్సేన్, కన్వినర్ ఉమ, అత్యాకప్లే, కౌసర్ జమీల్ ప్రసంగించారు.