నిమ్మగడ్డకు నో అపాయిట్మెంట్.. ఆయనతో పాటు

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల ప్రతిష్టంభన పై గవర్నర్ హరిచంద్ర భూషణ్ తో భేటీ అయ్యేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ తో పాటు 3నెలల వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై […]

Update: 2021-01-25 03:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల ప్రతిష్టంభన పై గవర్నర్ హరిచంద్ర భూషణ్ తో భేటీ అయ్యేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ తో పాటు 3నెలల వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై సుప్రీం మరికొద్దిసేపట్లో విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రఎన్నికల సంఘం అధికారులతో కానీ, రాష్ట్రఉద్యోగ సంఘాల నేతలతో కానీ భేటీ అయ్యేందుకు గవర్నర్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని, ఆ తరువాతే మాట్లాడతామని గవర్నర్ కార్యాలయం అధికారులు చెబుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News