నన్ను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు: గవర్నర్
దిశ, న్యూస్ బ్యూరో: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ జీవనం కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఈషా పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజ్ భవన్ నుంచి ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా “సంపూర్ణ జీవన శైలి, సహజ ఆహార అలవాట్లు – భవిష్యత్ భారత్‌కు, భూగోళ రక్షణకు విజన్” అన్న అంశపై గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తన బాల్యాన్ని […]
దిశ, న్యూస్ బ్యూరో: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ జీవనం కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఈషా పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజ్ భవన్ నుంచి ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా “సంపూర్ణ జీవన శైలి, సహజ ఆహార అలవాట్లు – భవిష్యత్ భారత్‌కు, భూగోళ రక్షణకు విజన్” అన్న అంశపై గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. చేతులు, కాళ్ళు కడుక్కుంటేనే తన నానమ్మ ఇంట్లోకి రానిచ్చేవారని చెప్పారు. ఇప్పడు కరోనా వైరస్ కాలంలో అప్పటి అలవాట్లు ఎంత ఆరోగ్యకరమైనవో తెలిసివస్తున్నాయని సౌందరరాజన్ వివరించారు.