ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
దిశ, కరీంనగర్: చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చేతల్లో మాత్రం విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల నుంచి మొదటి మొదటి గింజ కొనుగోలులోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్, అంకిరెడ్డి పల్లె గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి డొనేషన్లు తీసుకునేందుకు ఉన్నశ్రద్ద.. రైతుల సమస్యలపై లేదన్నారు. […]
దిశ, కరీంనగర్: చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చేతల్లో మాత్రం విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల నుంచి మొదటి మొదటి గింజ కొనుగోలులోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్, అంకిరెడ్డి పల్లె గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి డొనేషన్లు తీసుకునేందుకు ఉన్నశ్రద్ద.. రైతుల సమస్యలపై లేదన్నారు. ఎఫ్‌సీఐ నిబంధలను సడలించి రైతులకు భరోసా కల్పించాలన్నారు. రైతులను అరెస్టు చేయడం సరికాదన్నారు.
Tags: ex mp ponnam prabhakar, siricilla, purchasing centres,