మూడు మద్యం సీసాలు ఇక్కడివైతే సరే !

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో ఎవరైనా మూడు మద్యం సీసాలు కలిగి ఉండొచ్చని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మనిషికి మూడు సీసాల చొప్పున తెచ్చుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలు వేసింది. గత్యంతరం లేని స్థితిలో చట్ట సవరణ చేయాలని ఎక్సైజ్​శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే మూడు సీసాలైనా అనుమతించ కూడదని చెబుతోంది. ఒక్కో వ్యక్తి గరిష్టంగా […]

Update: 2020-10-04 11:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో ఎవరైనా మూడు మద్యం సీసాలు కలిగి ఉండొచ్చని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మనిషికి మూడు సీసాల చొప్పున తెచ్చుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలు వేసింది. గత్యంతరం లేని స్థితిలో చట్ట సవరణ చేయాలని ఎక్సైజ్​శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే మూడు సీసాలైనా అనుమతించ కూడదని చెబుతోంది. ఒక్కో వ్యక్తి గరిష్టంగా మూడు సీసాల వరకు మద్యం నిల్వ ఉంచుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

దీంతో కొందరు వ్యక్తులు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3 సీసాల చొప్పున తెచ్చుకుంటున్నారు. వారిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరి వద్ద గరిష్ఠంగా 3 సీసాల వరకు ఉండొచ్చని ప్రభుత్వమే ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పుడు అది ఏపీలో కొనుగోలు చేసినదైనా, ఇతర రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన మద్యాన్ని మూడు సీసాల చొప్పున తెచ్చుకునే వారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు తక్కువ రకం మద్యాన్ని తెచ్చి ఇళ్లలో ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు సీసాల నిబంధన మార్చుతూ చట్ట సవరణ చేయడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్ను విధించాలని ప్రతిపాదించింది.

Tags:    

Similar News