లక్ష మట్టి విగ్రహాలు పంచిన ప్రభుత్వ విప్

దిశ, ఏపీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్ష మట్టి వినాయక విగ్రహాలను ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం ఎదుట మట్టి విగ్రహాలను అందజేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో 43 పాయింట్లు ఏర్పాటు చేసి ఒక్కో పాయింట్ లో రెండున్నర వేల విగ్రహాలు అందుబాటులో ఉంచారు. గత పదిరోజులుగా 340 మంది కార్మికులు నిరంతరంగా శ్రమించి […]

Update: 2020-08-21 09:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్ష మట్టి వినాయక విగ్రహాలను ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం ఎదుట మట్టి విగ్రహాలను అందజేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గంలో 43 పాయింట్లు ఏర్పాటు చేసి ఒక్కో పాయింట్ లో రెండున్నర వేల విగ్రహాలు అందుబాటులో ఉంచారు. గత పదిరోజులుగా 340 మంది కార్మికులు నిరంతరంగా శ్రమించి విగ్రహాలను తయారు చేసినట్టు చెవిరెడ్డి పేర్కొన్నారు. మరుగున పడిపోతున్న మట్టి విగ్రహాల తయారీ జాతిని వెలుగులోకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News