గిరిజనుల భూములను ప్రభుత్వం లాక్కోవడం తగదు : ఎల్‌హెచ్‌పీఎస్
దిశ, కోదాడ : ఎన్నికలకు ముందు గిరిజనులకు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ గెలిచాక గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్య నాయక్ ఆరోపించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో […]
దిశ, కోదాడ : ఎన్నికలకు ముందు గిరిజనులకు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ గెలిచాక గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్య నాయక్ ఆరోపించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళితబంధు ఇస్తున్న సీఎం.. ప్రతి ఒక్క గిరిజనుడికి రూ.10 లక్షలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన బంధు అమలు చేయాలని కోరారు.
గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్ కల్పించి ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తండా, గ్రామం, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఎల్‌హెచ్‌పీఎస్‌ను బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూక్య రవి నాయక్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుగులోతు రాములు నాయక్, రాష్ట్ర నాయకులు బర్మావత్ రాజు నాయక్, జిల్లా నాయకులు భూక్య కాంతారావు, భగవత్, భిక్షం, గాంధీ తదితరులు పాల్గొన్నారు.