పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం
దిశ ఏపీ బ్యూరో: 2020-21 విద్యాసంవత్సరం నేటి నుంచి ఆరంభమైంది. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు టీచర్లు స్కూళ్లలో అడ్మిషన్లు ఆరంభించారు. ఈ నెల ఆరంభంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం విధులు నిర్వర్తించేందుకు స్కూళ్లకు వెళ్లిన టీచర్లు తొలిరోజు అడ్మిషన్లు ఆరంభించారు. తొలిరోజు స్కూళ్ళలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అడ్మిషన్లు జోరూగా సాగినట్టు తెలుస్తోంది. కొస్తా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీ నెలకొన్నట్టు సమాచారం. ఇక […]
దిశ ఏపీ బ్యూరో: 2020-21 విద్యాసంవత్సరం నేటి నుంచి ఆరంభమైంది. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు టీచర్లు స్కూళ్లలో అడ్మిషన్లు ఆరంభించారు. ఈ నెల ఆరంభంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం విధులు నిర్వర్తించేందుకు స్కూళ్లకు వెళ్లిన టీచర్లు తొలిరోజు అడ్మిషన్లు ఆరంభించారు. తొలిరోజు స్కూళ్ళలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అడ్మిషన్లు జోరూగా సాగినట్టు తెలుస్తోంది. కొస్తా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీ నెలకొన్నట్టు సమాచారం.
ఇక అడ్మిషన్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో టీచర్లు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నారని దీంతో ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల అడ్మిషన్ల ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడంతో అడ్మిషన్లు జరగలేదు. ఈ ప్రాంతాల్లో రేపు అడ్మిషన్లు జోరందుకుంటాయని టీచర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల వివరాలు నోట్ చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ సమన్వయంతో జరుగుతోంది. టీచర్లను రోజుల వారీగా విభజించడంతో అడ్మిషన్ల ప్రక్రియను పంచుకున్నారు. నెల రోజుల గడువు ఉండడంతో అడ్మిషన్లు భారీగా జరుగుతాయని టీచర్లు చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల టీసీలు తీసుకునేందుకు పది పాసైన విద్యార్థులు ఉత్సాహం చూపారు.